భారత్ చైనా మధ్య సంబంధాలు అంతకంతకూ దిగజారుతున్న పరిస్థితుల్లోనూ చైనాలో భారత ప్రధానిమోదీకి అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. చైనీయులు నరేంద్రమోదీని అసాధారణ పురుషుడిగా అభిమానిస్తున్నారట. ఈమేరకు అమెరికా పత్రిక డిప్లొమాట్ ఓ కథనాన్ని ప్రచురించింది. మోదీ నాయకత్వంలోని భారత్ ఇతర దేశాలతో సత్సంబంధాలు నెరుపుతూ విశ్వశాంతికి పాటుపడుతోందని జర్నలిస్ట్ మూ షుంషాన్ అందులో రాసుకొచ్చారు. చైనా ప్రజలు అక్కడి సామాజిక మాధ్యమాల్లో మోదీకి పెట్టిన పేరు ‘మోదీ లాక్షాయన్’. అంటే అసాధారణ శక్తిసామర్థ్యాలున్న, పెద్దవాడైన దివ్య పురుషుడని అర్థమట. ఆయన రూపాన్ని, వస్త్రధారణను అమితంగా ఇష్టపడుతున్న చైనాప్రజలు ఆయన వ్యక్తిత్వానికీ ముగ్ధులైపోతున్నారట. ముఖ్యంగా ఆయన నేతృత్వంలోని భారత విదేశాంగ విధానం గురించి అక్కడివాళ్లు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారట. అమెరికా, రష్యాంవంటి అగ్రదేశాలతో పాటు అన్నిదేశాలతోనూ స్నేహంగా ఉండడం చూసి వాళ్లు ఆశ్చర్యపోతున్నారట. 20ఏళ్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థలకు తాను వార్తలు అందిస్తున్నానని అయితే చైనీయులు ఓ విదేశీనేతకు ముద్దుపేరు పెట్టుకోవడం, అంతలా అభిమానం చూపించడం తాను చూడలేదంటున్నారు షుంషాన్.ట్విట్టర్ కు పోటీగా చైనాలో వచ్చిన సైనా వీబో లో మోదీకి అకౌంట్ ఉండేది. ఆయనకు రెండున్నరలక్షలమంది ఫాలోవర్స్ ఉండేవాళ్లు. అయితే 2020లై చైనా యాప్ లపై నిషేధంలో భాగంగా మోదీ తన అకౌంట్ ను క్లోజ్ చేశారు.
PM Modi popular among Chinese citizens, gets unusual nickname
Read @ANI Story | https://t.co/lLFw98QAkm#PMModi #Chinese #NarendraModi #India #China pic.twitter.com/xT6tMDlUcp
— ANI Digital (@ani_digital) March 20, 2023