అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన 17 ఏళ్ల బాలుడిని చైనా సైన్యం ఎట్టకేలకు భారత సైన్యానికి అప్పగించింది. లంగ్టా జోర్ ప్రాంతానికి చెందిన మిరామ్ తరోన్ ఈ నెల 18న అదృశ్యమయ్యాడు. అతన్ని చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అప్పర్ సియాంగ్ జిల్లాలో కిడ్నాప్ చేసినట్టు తేలింది. తరోన్ ను విడిపించేందుకు భారత్ దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే అతన్ని గుర్తించామంటూ చైనా ఆర్మీ ఈనెల 23న భారత్ కు సమాచారం అందించింది. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి..ఇతర లాంచనాలు పూర్తి చేసిన అనంతరం భారత ఆర్మీకి అప్పగించారు.