భారత్ లోని చైనా రాయబారి సన్ వీడాంగ్ చెన్నైలో సందడి చేశారు. ది హిందూ పత్రిక ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి పత్రిక ఎడిటర్ తో ముఖాముఖి చర్చలు జరిపారు. సురేష్ నంబాత్, సహా ఇతర సిబ్బందితోనూ గంటలపాటు ముచ్చటపెట్టారు.
Visited the headquarters of @the_hindu. Face-to-face communication leads to mutual understanding and trust. Welcome you all to explore and know more about a real, objective and 3-dimensional China. pic.twitter.com/MpJ3hWLYF3
— Xu Feihong (@China_Amb_India) June 1, 2022
హిందూ కార్యాలయానికి వెళ్లాను. ఎడిటర్, నాకు మధ్య జరిగిన సంభాషణ పరస్పర అవగాహన విశ్వాసానికి దారితీసేలా మా సంభాషణ సాగింది. నిజమైన, త్రీ డీ చైనా గురించి మరింత తెలుసుకోవడానికి మీ అందరికీ స్వాగతం అంటూ సందర్శన వివరాల వీడియోను పోస్ట్ చేశాడు వీడాంగ్. ఎడిటర్ సురేష్ తో పాటు ఇతర సీనియర్లు,రిపోర్టర్లతో వీడాంగ్ ఇంటరాక్ట్ అవడం కనిపిస్తోంది. మొత్తం మీడియా అవుట్లెట్ పనితీరును ప్రశంసించారు.
అయితే వామపక్ష మీడియా సంస్థ అయిన హిందూ కార్యాలయానికి చైనా రాయబారి వెళ్లడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ది హిందూ తరచూ చైనా అనుకూల వార్తలు ప్రచురిస్తుందని…అందుకే వీడాంగ్ వెళ్లాడని కొందరంటే…సన్ వీడాంగ్ చైనీస్ ఆఫీస్ బ్రాంచ్ ల్లో ఒకదాన్ని సందర్శించారని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. హిందూ ఆఫీసుకెళ్లిన వీడాంగ్ సొంత సంస్థ ఉద్యోగులతో మాట్లాడినట్టే ఎంత స్వేచ్ఛగా , సంతోషంగా మాట్లాడుతున్నాడో అని ఇంకొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. “ఉద్యోగులకు పెప్ టాక్ ఇవ్వడానికి బ్రాంచ్ కార్యాలయాన్ని సందర్శించిన CEO’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
Visited State Industries Promotion Corporation of Tamil Nadu(SIPCOT) Industrial Park at Chennai & planted friendship trees with executive team. China & India, both major emerging economies,have great potential in trade & investment win-win cooperation & common development. pic.twitter.com/s1yeKogtqB
— Xu Feihong (@China_Amb_India) May 31, 2022
2021 లో చైనా కమ్యూనిస్ట్ పార్టీకి 100 ఏళ్లు పూర్తైన సందర్భంగా దిహిందూ పూర్తి పేజీ చైనా ప్రకటనను ప్రచురించిన సంగతి తెలిసిందే. వామపక్ష ఔట్లెట్ ది హిందూకి,చైనా ప్రభుత్వానికి మధ్య పరస్పర అవగాహన ఉందనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ఆర్థికపరమైన సంబంధాలూ ఉన్నాయంటారు.
2021 సంవత్సరంలో, చైనా వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వ్యాప్తి చెందిందని ప్రపంచ దేశాలు మండిపడుతున్న వేళ… ఆయా దేశాల ఆరోపణల్ని ఖండించింది ది హిందూ. అలాగే 2020లో గాల్వాన్ లోయలో భారత సైన్యం, చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణ సందర్భంలో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. అయితే కొంత కాలానికే చైనాకు అనుకూలమైన మరో ప్రకటననూ హిందూ ప్రచురించింది. అక్టోబర్ 1, 2020లో జాతీయ దినోత్సవం సందర్భంగా అలాగే పూర్తి పేజీ ప్రకటనను ప్రచురించిందది. భారత సైనికుల త్యాగాల్ని కనీసం లెక్కలోకి తీసుకోకుండా డబ్బుకోసం చైనా ప్రకటనను ప్రచురించడంపై అప్పుడూ ఆరోపణలు వచ్చాయి. చైనాతో ఈ మీడియా సంస్థ ఆర్థిక లావాదేవీలపై ఐటీ శాఖ విచారణ సైతం ప్రారంభించింది. ఇక 2020 ఏప్రిల్ 2న కూడా అలాంటి ప్రకటనే. మాట నిలుపుకోని చైనా అడుగడుగునా భారత్ ను ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో అనుకూల ప్రకటనను ప్రచురించింది ది హిందూ.
https://twitter.com/SanataniJain/status/1532073500764418048?s=20&t=zZfteLDtd5kTmqyk0o14zg
CEO visiting the branch office to give pep talk to employees
Nothing unusual— Sandeep Gupta 🇮🇳 (@sandeepblore) June 1, 2022