బౌద్ధుల అంతర్జాతీయ మత గురువు దలైలామా వారసుడి ఎంపిక సంక్లిష్టంగా మారింది. ప్రపంచ బౌద్ధమత గురువు ని దలైలామా గా పిలుస్తారు. తర్వాత దలైలామా ఎంపిక కోసం ప్రస్తుత దలైలామా అన్వేషణ మొదలు పెట్టారు. దలైలామా వారసత్వం ఎవరికి చెందాలో నిర్ణయించుకునే హక్కు టిబెటన్ ప్రజలదేనన్నది భారత్ అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని చైనా గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఇక్కడే సమస్య మరింతగా పెరుగుతోంది.
…..
టిబెట్‌పై చైనా దాడిచేసినప్పుడు దలైలామా భారతదేశానికి వచ్చేశారు. అప్పుడు భారత ప్రభుత్వం ఆయనకు శరణు ఇచ్చింది. ఆయనకు ధర్మశాలలో స్థలాన్ని ఇచ్చి అక్కడ శాశ్వత నివాసానికి అనుమతించింది. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలాలో ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంటే ఇక్కడ స్థానిక పరిపాలన, అధికారాలు అన్నీ దలైలామా నేతృత్వంలో స్వయంప్రతిపత్తి తో పనిచేస్తాయి అన్త్నమాట. ధర్మశాలలో మౌలిక వసతులు, భద్రత, మరియు సౌకర్యాలను భారతదేశం బయట నుంచి అందిస్తుంది.
…
గౌతమ బుద్ధుడు భారతదేశంలో జన్మించి, ఇక్కడే బౌద్ధమతాన్ని స్థాపించారు. అప్పట్లో అనేక మంది భారతీయ రాజులు బౌద్ధాన్ని ఆదరించారు. ఇప్పుడు కూడా నరేంద్రమోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం బౌద్ధాన్ని చక్కగా ఆదరిస్తోంది. సార్నాథ్, బోధ్ గయ, కుశినగర్, నాళందా వంటి ప్రాచీన బౌద్ధ క్షేత్రాలను అభివృద్ధి చేసి, అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రాలుగా మార్చింది. ఇది బౌద్ధ సంప్రదాయాల పరిరక్షణకు పెద్ద సహాయంగా నిలుస్తోంది. బౌద్ధ సర్క్యూట్ అనే ప్రత్యేక పర్యాటక ప్రణాళికను రూపొందించి, భారతదేశంలోని బౌద్ధ సంబంధిత ప్రదేశాలను సందర్శించేందుకు దేశీయ, విదేశీ పర్యాటకులకు ప్రోత్సాహం కల్పిస్తోంది.
…
కానీ, చైనా మాత్రం బౌద్ధమతాన్ని, బౌద్ధ భిక్షువులను తరుచుగా వేధిస్తోంది. బౌద్ధమత గురువు దలైలామాను బెదిరిస్తూ వస్తోంది. టిబెట్ ను గుప్పిట పట్టాలన్న కుట్రలను ముందుకు తీసుకొని వెళుతోంది. ఇటువంటి కుట్రలను అంతా అర్థం చేసుకోవాలి.