అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్ నాన్సీ పెలోసి ఈమధ్యే తైవాన్ను సందర్శించారు. దీంతో ఆగ్రహించిన చైనా ప్రభుత్వం ఆమెపై, ఆమె కుటుంబంపై ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. ఆమె రెచ్చగొట్టే చర్యలకు ప్రతిస్పందనగా ఆంక్షలు విధించినట్లు చైనా మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
చైనా నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ, పెలోసి తైవాన్ను సందర్శించాలని పట్టుబట్టారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
నాన్సీ పెలోసి తైవాన్ పర్యటన చైనా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను తీవ్రంగా ఉల్లంఘించడమేనని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పర్యటన వన్-చైనా సూత్రాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని కూడా పేర్కొంది.
నాన్సీ పెలోసి మంగళవారం తైవాన్ వెళ్లారు. తైవాన్ అధ్యక్షుడు సాయ్ ఇంగ్-వెన్ తో పాటు పలువురు అధికారులను కలిశారు.