కోవిడ్ ని ఎలా నియంత్రించాలో కేరళ ని చూసి నేర్చుకోండి !
0 జీరో కోవిడ్ పాలసీ ని ఎలా అమలు చేయాలో చైనా ని చూసి నేర్చుకోండి!
చైనా ఎలా చెప్పమంటే రాహువు అదే చెప్తాడు. పైగా నేపాల్ లో నైట్ క్లబ్ లో మాంచి విషయ పరిజ్ఞానం దొరికి వుంటుంది చైనా రాయాబారి ద్వారా ! ఇక ఆ జ్ఞాన బల్బు తాలూకు వెలుగుని మోడీ గారి వైపు ప్రసరించాడు రాహువు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే చైనా పడేసే కుక్క బిస్కెట్ల ని తింటూ తోకాడిస్తూ ఉంటుంది. భారత్ లో కోవిడ్ మరణాల సంఖ్య 47 లక్షలు అంటూ వాక్రుచ్చింది WHO. ఈ సంఖ్య ఎవరిచ్చి ఉంటారు ? పెద్దగా ఆలోచించాల్సిన విషయం లేదు బుర్ర ఉన్న ఎవరికయినా ఇట్టే అర్ధం అయిపోతుంది. అభివృద్ధి చెందిన దేశాలు వాటి తాలూకు ఆరోగ్య వ్యవస్థ గురుంచి గొప్పలు చెప్పుకునే దేశాలలో కోవిడ్ మరణాల సంఖ్య భారత్ కంటే ఎక్కువగా ఉండడం అవమానకరం అనిపించి ఉంటుంది దాంతో భారత్ లోని మరణాల సంఖ్యని పెద్దది చేస్తే వాళ్ళ పెద్ద గీత కాస్తా చిన్నది అయిపోతుంది.
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ వల్ల ఎంత మంది చనిపోయారో ఇచ్చే డాటా ప్రకారమే కేంద్ర ఆరోగ్యశాఖ రికార్డ్ చేసుకుంటుంది తప్పితే నేరుగా కేంద్ర ఆరోగ్య శాఖ వివరాలు సేకరించదు. మరి అలాంటప్పుడు 47 లక్షలమంది మంది కోవిడ్ వల్ల చనిపోయారు అంటూ WHO ఎలా అనగలగింది? జస్ట్ ప్రస్తుతం చైనాలో జరుగుతున్న కోవిడ్ నియంత్రణ ఆరాచకాలని కప్పి పుచ్చు కోవడానికే ఈ నాటకానికి తెర తీశారు.
నెల రోజుల నుండి చైనా లోని షాంఘై నగరం తీవ్ర ఆంక్షల మధ్య లాక్ డౌన్ లో ఉంది !
1. జీరో కోవిడ్ పాలసీ అంటూ జింగ్ పింగ్ ప్రభుత్వం బయట ప్రపంచానికి చెప్తున్నా నిజానికి షాంఘై లో జరుగుతున్నది వేరు.
2. ప్రపంచం మొత్తం స్వేచ్ఛగా ఉండగా కేవలం చైనాలోనే ఎందుకు తరుచూ లాక్ డౌన్ లు పెడుతున్నారు ? అదీ ఒక్క మనిషి కూడా బయటికి రాకుండా పోలీసుల పహారా మధ్య తీవ్ర నియంత్రణ పద్ధతులని అవలంబిస్తున్నది చైనా.
3. షాంఘై చైనాలోని అతి పెద్ద నగరాలలో రెండవది బీజింగ్ తరువాత. అలాంటి షాంఘై నగరంలో నెల రోజుల నుండి లాక్ డౌన్ అమలులో ఉంది. నిత్యావసర సరుకుల తీవ్ర కొరతతో ఎందుకు లాక్ డౌన్ పెట్టారు ? నిర్బంధం తట్టుకోలేక ప్రజలు లాక్ డౌన్ ఉన్నా సరే ఎందుకు రోడ్లమీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు ?
4. ఒక్క షాంఘై మాత్రమే కాదు గత 7 నెలులుగా దాదాపుగా ఒక్కో నగరం లాక్ డౌన్ లోకి వెళ్ళడం మళ్ళీ యధాతధ స్థితికి రావడం మళ్ళీ లాక్ డౌన్ లోకి వెళ్ళిపోవడం జరుతూ వస్తున్నది. కానీ ఈ సారి షాంఘై లో అదుపు చేయలేనంతగా కోవిడ్ విజృంభించడం వలన గతి లేని స్థితిలో తీవ్ర ఆంక్షల మధ్య లాక్ డౌన్ పెట్టారు.
5. చైనా తయారు చేసిన ‘’సినోవాక్సిన్ ‘’ ఎఫికసీ రేట్ [ఫలితాలని ఇచ్చే శాతం] చాలా తక్కువగా ఉండడమే అసలు కారణం. సినో వాక్సిన్ వేసుకున్న చైనా ప్రజలకి కోవిడ్ మళ్ళీ మళ్ళీ వ్యాపించడం జరుగుతూ వస్తున్నది.
6. వెస్ట్రన్ దేశాల తో పాటు చైనా కి చెందిన సినో వాక్సిన్ ఎలాంటి ఫలితాలని ఇస్తున్నదో సరయిన రికార్డ్ లేకుండానే ఇతర దేశాలకి ఎగుమతి చేసుకోవడానికి WHO అనుమతి ఇచ్చింది. దాని ఫలితమే ఈ రోజు చైనా లో కోవిడ్ విజృంభణ కి కారణం అయ్యింది.
7. తాజా వివరాల ప్రకారం ఫైజర్ వాక్సిన్ ఎఫికసీ రేట్ 23% మాత్రమే. మన దేశంలో కుహనా మేధావులు ఫైజర్ వాక్సిన్ కోసం ఎంతలా ప్రచారం చేశారో మనకి తెలుసు. అందుకు గాను సదరు ఫైజర్ ఫార్మా ఎంత డబ్బులు ఇచ్చి ఉంటుందో వాళ్ళకే ఎరుక.
8. అన్ని దేశాలలో ప్రశాంత వాతావరణం ఉన్న వేళ ఇప్పుడు చైనాలో విజృంభిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ మళ్ళీ ప్రపంచం మీదకి వదిలే ప్రయత్నంగా భావించవచ్చు.
9. చైనా ఈ సారి మరో కొత్త వేరియంట్ ని ప్రపంచం మీదకి వదలబోతున్నది. అది వైరస్ కాకపోవచ్చు. మరొక జీవాయుధము అవవచ్చు. ఎందుకంటే ఒక సారి వెనక్కి వెళ్ళి చూస్తే 2019 నవంబర్ లో కూడా ఇప్పుడు షాంఘై లో లాగా తీవ్ర ఆంక్షల మధ్య లాక్ డౌన్ పెట్టి ఆ తరువాత అంతా బాగుంది అని చెప్పడం తరువాతి రోజుల్లో అది ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడం మనకి అనుభవమే.
10. వీడియొ సాక్ష్యం చూస్తే ప్రస్తుతం షాంఘై నగరంలో నిత్యావసర వస్తువుల కొరత చాలా తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తున్నది. చైనా తన అతి పెద్ద పారిశ్రామిక, వాణిజ్య నగరం అయిన షాంఘై కి నిత్యావసరాలు కూడా సరఫరా చేయలేని స్థితిలో ఉంది.
11. మూడు రోజులకి ఒక సారి మాత్రమే మాల్స్ లోకి వెళ్ళి కావాల్సినవి కొనుక్కోవచ్చు కానీ ప్రస్తుతం అన్ని దొరకట్లేదు అంటూ ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. మాల్ లోకి వెళ్లాలంటే కనీసం మూడు గంటల సేపు పట్టేంత క్యూ లు ఉంటున్నాయి. ఒక్కో మాల్ దగ్గర కనీసం మూడు కిలోమీటర్ల దూరం క్యూలు ఉంటున్నాయి కానీ అందరికీ అవకాశం వచ్చేసరికి లాక్ డౌన్ టైమ్ మొదలు అవుతున్నది అంటే ఇచ్చిన సమయం సరిపోక అరకొర వస్తువులతో బయటికి వస్తున్నారు ప్రజలు.
12. మాల్స్ లో కొనడానికి అందరికీ అవకాశం దొరుకుతున్నదా అంటే అదీ లేదు. మాల్స్ లో కొనడానికి కార్డులు ఇస్తున్నారు వాటి మీద తేదీ ఉంటుంది ఎప్పుడు కొనాలో అలాగే దాని మీద ఉన్న తేదీ రోజున మాత్రమే మాల్ లో కొనాల్సి ఉంటుంది అదీ 2 గంటల సమయం ఇస్తున్నారు కానీ క్యూలు పెద్దవిగా ఉండడం చేత కార్డు ఉన్నా కొనలేని స్థితి ప్రజలది.
13. ఒక పెద్ద కీర దోసకాయ ని ముక్కలు చేసుకొని ముగ్గురు పంచుకోవడం వీడియొ లో స్పష్టంగా కనపడుతున్నది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
14. చైనాలో సప్లై చైన్ బాగా దెబ్బ తిన్నది అన్నది సుస్పష్టం. ముఖ్య నగరాలలో లాక్ డౌన్ పెట్టి కనీసం తినడానికి నిత్యావసరాలు సప్లై చేయలేక రేషన్ పెట్టి ఇస్తున్నది చైనా.
15. మొత్తం 26 మందికి కలిపి రెండు బాగుల బియ్యం, రెండు ట్రే ల గుడ్లు [24 ] ఇస్తున్నారు. దీనివల్ల అర్ధం అవుతున్నది ఏమిటంటే నిత్యవాసరాల కొరత తీవ్రంగా ఉంది చైనాలో.
16. భయం ఎంతలా ఉన్నదీ అంటే బతికి ఉన్నవాళ్ళని వాన్ లో ఎక్కిస్తున్నారు దహనం చేయడానికి అదే సమయంలో చనిపోయింది అనుకున్న మహిళ లో అవయువాల కదలికలు చూసి మళ్ళీ దించి బంధువులకి అప్ప చెప్పిన సంఘటన వీడియొ సాక్షిగా ఉంది.
17. చైనా దేశ వ్యాప్తంగా షాంఘై నగరం తో పాటు 3 జిల్లాలకి కావాల్సిన నిత్యావసరాలని డొనేషన్ రూపంలో పంపిస్తున్నారు కానీ చైనా అధికారులు వాటిని ప్రజలకి ఇవ్వకుండా గోడౌన్ లలో దాచిపెట్టి బంగారం తూచినట్లు కొద్ది కొద్దిగా ప్రజలకి పంచుతున్నారు. కొన్ని చోట్ల అయితే డొనేషన్ గా వచ్చిన వాటిని ప్రజలకి అమ్ముతున్నారు చైనా అధికారులు.
18. కొద్ది వారాల క్రితం WHO భారత్ కి చెందిన భారత్ బయో టెక్ ‘’కోవాక్సిన్ ‘’ మీద నిషేధం విధించింది. కానీ అసలు ప్రభావం చూపని సినో వాక్సిన్ మీద ఎలాంటి నిషేధం పెట్టలేదు. WHO ద్వారా వాక్సిన్ సరఫరా చేసే లిస్ట్ లో నుండి కోవాక్సిన్ ని తీసేసింది. ఫైజర్,సినోవాక్ మీద మాత్రం నిషేధం లేదు.
చైనాలో పరిస్థితి ఎలా ఉందో బయటి ప్రపంచానికి తెలిసే వీలు లేదు. ఎంత మంది చనిపోయారో అసలు నిజం చెప్పదు. ప్రస్తుతం విజృంభిస్తున్న వేరియంట్ ఏమిటో తప్పుడు సమాచారం ఇస్తున్నది. రెండు సార్లు వాక్సిన్ వేశాక కూడా అక్కడ కోవిడ్ విజృంభణ చూస్తుంటే సినోవాక్ వాక్సిన్ అసలు పనిచేయలేదు అని అర్ధం చేసుకోవచ్చు. ఇక చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువుల ద్వారా మళ్ళీ ప్రపంచ దేశాలలో కొత్త కొత్త వేరియంట్ లు విజృంభించే అవకాశం లేకపోలేదు. ఇలాంటి సమయం కోసమే వేచి చూసే గుంట నక్క రాజాకీయులకి కొదువ లేదు మన దేశంలో. మన దేశ ద్రోహులకి ఒకటే కావాలి అది మళ్ళీ ఇంకో వేవ్ వచ్చి మన ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని మోడీ రాజీనామా చేయాలి ! అలా జరగదనే ఆశిద్దాం !