కరోనా మరోసారి విజృంభిస్తోంది. పెద్దసంఖ్యలో పిల్లలకు వైరస్ సోకడంతో బెంగళూరులో హైఅలర్ట్ విధించారు. రెండో వేవ్ మధ్యవయసువారిని, యువకులను పొట్టనపెట్టుకుంటే …కొద్దిరోజులుగా పిల్లల్లో పెద్దఎత్తున పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. బెంగళూరులో కేవలం వారంరోజుల వ్యవధిలో మూడువందల మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆగస్టు 5 నుంచి 10వ తేదీ మధ్యలో 127 మంది పదేళ్లలోపు పిల్లలకు, 10 నుంచి 19 ఏళ్లలోపు 174 మంది పిల్లలకు కరోనా సోకినట్టు తెలిసింది. దీంతో బెంగళూరు నగరపాలక, కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖలు అప్రమత్తమయ్యాయి. మహమ్మారిని కట్టడి చేసేందుకు 144 సెక్షన్ విధించారు. పిల్లలకు వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రానినేపథ్యంలో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. థర్డ్‌వేవ్ ఎక్కువగా పిల్లల్ని టార్గెట్ చేయనుందనే నిపుణుల హెచ్చరికలతో బెంగళూరు పరిస్థితి కలవరం కల్గిస్తోంది. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య 3 రెట్లు పెరిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.