పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ దవాత్-ఇ- ఇస్లామీకి 25 ఎకరాల భూమిని కేటాయించింది ఛత్తీస్ గఢ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే స్థానిక బీజేపీ నాయకుడు మాజీ మంత్రి బ్రిజ్మోహన్ అగర్వాల్ ఆందోళనతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. భూ కేటాయింపును రద్దు చేసింది.
పాకిస్తాన్ తో సంబంధాలున్న ఇస్లామిక్ సంస్థ దవాత్-ఇ- ఇస్లామీకి 25 ఎకరాలు కేటాయించారు ఈ మధ్యనే భూపేష్ భాగల్ నేతృత్వంలోని ప్రభుత్వం. రాయ్ పూర్ సమీపంలోని బోరియాకుర్ద్ ప్రాంతంలో కమ్యూనిటీ సెంటర్ నిర్మాణం కోసం ఆ భూమిని కేటాయించారు. అయితే దీనిపై ఏమన్నా అభ్యంతరాలుంటే చెప్పాలంటూ జిల్లా అడిషనల్ కలెక్టర్ జిల్లా కోర్టు ద్వారా ప్రకటన జారీ చేశారు. డిసెంబర్ 22న ఈ ప్రకటన వచ్చింది. ఈ ఏడాది జనవరి 13 లోగా అభ్యంతరాలు తెలపాలని కోరారు. అభ్యంతరం వ్యక్తం చేసిన అగర్వాల్… ఆసంస్థకు పాకిస్తానీ ఇస్లామిక్ గ్రూపులతో సంబంధం ప్రభుత్వానికి తెలిపారు. సీఎంఎం నుట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రభుత్వం 25 ఎకరాల భూమిని కేటాయించిన దవాత్ ఇ ఇస్లామి ఒక పాకిస్తాన్ బేస్డ్ ఆర్గనైజేషన్ అని..భారత్ లో దాని విభాగానికి అంతభూమి ఎలా కేటాయిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు.
https://twitter.com/brijmohan_ag/status/1477630115584512000?s=20
ఆ సంస్థమీద పలు ఆరోపణలున్నాయని…భారత్ లో మత మార్పిళ్లే లక్ష్యంగా సంస్థ పనిచేస్తోందని తేలింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ భారత్ లో శాఖలు ఏర్పాటుచేసుకుందని…ఇక్కడి యువతను ఉగ్రవాదంవైపు ప్రేరేపించే కార్యక్రమాలు రూపొందిస్తోందని ప్రాథమిక విచారణలోనూ తేలింది. ఓటర్లను ప్రభావితం చేయడం, ఉగ్రవాదం కోసం విరాళాలు సేకరించడం సంస్థ పనులు. ఆ సంస్థకు చెందిన పలువురు సభ్యుల్ని ఉగ్రవాదులుగా, గూఢచారులుగా నిర్థారించి…ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగం పట్టుకుంది. సంస్థ అఫీషియల్ ఫేస్ బుక్ పేజీలో పాకిస్తానీ ఫైండర్ ఇల్యాస్ ఖాద్రి ఫొటో , ఛత్తీస్ గఢ్ విభాగం లోగోలు ఉన్నాయని తెలిపారు.
https://twitter.com/kaushkrahul/status/1477879753612816385?s=20
కేవలం 25 ఎకరాలు అంటే 10 లక్షల 76 వేల చదరపు అడుగుల స్థలాన్ని డొనేట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒక కమ్యూనిటీ సెంటర్ 25 ఎకరాలు ఎందుకు అని ఆయన నిలదీశారు. ఆ వ్యవహారం వివాదాస్పదం అవుతుండడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దవాత్ ఇ ఇస్లామీకి భూకేటాయింపులను రద్దు చేసింది. అంతపెద్దమొత్తంలో భూమి ఎందుకు కేటాయించాల్సి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తామని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ దేవేంద్రపటేల్ తెలిపారు. సయ్యద్ కలీం వ్యక్తి సంస్థ తరపున ఆ భూమికోసం కలెక్టరాఫీసులో దరఖాస్తు చేసుకున్నాడు. దాన్ని స్వీకరించిన తరువాత అదనపు తహసీల్దార్ ద్వారా మెమెరాండం జారీ చేశామని…ప్రకటన వెలువడిన తరువాత దరఖాస్తుదారు కోర్టుకు హాజరై … తనకు 10,000 చదరపు అడుగుల జాగా చాలని… 25 ఎకరాలు వద్దని రాసి దరఖాస్తు ఉపసంహరించుకున్నట్టు తెలిసింది. మొత్తానికి విపక్ష నాయకుల హెచ్చరికలతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తహసీల్దార్ చేసిన తప్పువల్ల పెద్ద పొరపాటైందని మళ్లీ అధికారిక ప్రకటన ఇచ్చారు. ప్రకటనలో తప్పులకు బాధ్యులైన అధికారులకు నోటీసులిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.
పాకిస్తాన్ కేంద్రంగా 1981లో మౌలానా అబు బిలాల్ మహ్మద్ అలియాస్ అత్తారీ, దవాత్ ఇ ఇస్లామీని స్థాపించారు. సున్నీ ముస్లిం ఆర్గనేజేషన్ ఇది. పలు ఉగ్రవాద సంస్థలతో దానికి సంబంధాలున్నాయి. భారత్ సహా ప్రపంచ దేశాలన్నింట్లోనూ సంస్థ శాఖలున్నాయి. సోషల్ వర్క్ పేరుతో టెర్రరిజాన్ని ప్రచారం చేస్తుందనే ఆరోపణలున్నాయి. పాకిస్తానీ నాయకుడి హత్యకేసులో ఈ సంస్థ సభ్యుడి నిందితుడని తేలాక… సైనిక అధికారులు సంస్థ కార్యకలాపాల్ని నియంత్రిస్తూ వస్తున్నారు. 2020లో పారిస్ లో జరిగిన చార్లీ హెబ్డో దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో ఒకడు దవాత్ ఇ ఇస్లామీ వ్యవస్థాపకుడైన అత్తారీనే తన గురువు అని పోలీసులకు చెప్పాడు. 2021 అక్టోబర్లో ఢిల్లీలో అరెస్టయిన ఎండీ అష్రఫ్ అనే పాకిస్థానీ ఉగ్రవాదికి కూడా ఈ సంస్థతో సంబంధం ఉన్నట్లు తేలింది.