హిందు ధర్మ రక్షణకోసం పోరాడుతున్న యువకులకు ఉచితన్యాయం సహాయం అందిస్తున్న న్యాయవాది కరుణాసాగర్ కు ఛత్రపతి శివాజీ జాతీయ సేవా పురస్కారం దక్కింది.
ధర్మరక్షణలో ఉంటూ ప్రత్యర్థుల వేధింపులకు గురవుతున్న, కేసులపాలవుతున్న వారికి కరుణాసాగర్ అండగా ఉంటున్నారు. అలాంటి వాళ్ల కేసులను వాదిస్తూ,వారికి బెయిలు ఇప్పిస్తూ కాపాడుతున్నారు.ఆయన సేవలను గుర్తించి ఛత్రపతి శివాజీ పేరిట ఇస్తున్న పురస్కారానికి ఎంపిక చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.