చారిత్రక సినిమాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో వాస్తవాలతో కూడిన సినిమాగా చావా ప్రసిద్ధి పొందింది. చత్రపతి శివాజీ మహారాజ్ ఆయన కుమారుడు శంభోజి వంటి గొప్ప వీరుల గాధలతో ఈ సినిమాని రూపొందించారు. హిందీ వర్షన్ నీ తెలుగు ప్రజలు బాగా ఆదరించారు. ఇప్పుడు తెలుగులో అనువదించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ సినిమాలో ఎన్నెన్నో విశేషాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నటి రష్మిక మందన్న లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందించారు . ఫిబ్రవరి 14న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అనేక రాష్ట్రాలలో ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ నెల 7న తెలుగు రాష్ట్రాలో ఛావా సందడి మొదలు కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తెలుగులో ఛావా చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో వసూళ్లు ఎలా ఉంటాయా అనే ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. డీసెంట్ బుకింగ్ నమోదు అవుతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా థియేటర్లు ఈ సినిమాకు దొరికాయి. దీంతో ప్రేక్షకుల ఆశీస్సులు పొందడం ఖాయం అన్నమాట వినిపిస్తున్నది.