భారత్ తిరిగివచ్చేందుకు కాబూల్ విమానాశ్రయానికి చేరుకున్నవారిని కిడ్నాప్ చేశారన్నవార్తలు ఆందోళన కలిగించాయి. అయితే తాలిబన్లు వారిని విచారించి విడుదల చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వారిని సురక్షితంగా స్వదేశం తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 150 మంది భారతీయుల్ని, మరికొందరు విదేశీయుల్ని తాలిబన్లు కిడ్నాప్ చేసినట్టు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్ ఒకరు కూడా ట్వీట్ చేయడంతో కలకలం రేగింది. విదేశాంగశాఖ అప్రమత్తమై సంప్రదింపులు జరిపింది. వారిదగ్గరున్న పత్రాలు పరిశీలించేందుకే తీసుకెళ్లినట్టు తెలిసింది. తనిఖీల అనంతరం వారిని వదిలిపెట్టారు.