పోలీసులు, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు క్రిమినల్ కేసుల్లో వేసే చార్జిషీట్లను బయటపెట్టలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వేచ్ఛ పొందేందుకు అవేం ప్రజా దస్ర్తాలు కావని, వాటిని అందరికీ చేరేలా బహిర్గతం చేయలేమని న్యాయస్థానం పేర్కొంది. చార్జిషీట్లను ప్రజలందరికీ తెలిసేలా అందుబాటులో ఉంచాలని… సౌరవ్ దాస్ అనే జర్నలిస్ట్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. అది కోడ్ ఆఫ్ ప్రొసీజర్ లోని నిబంధనలకు విరుద్ధమంది.జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీరవికుమార్ తో కూడిన ధర్మాసనం ఈ విధంగా స్పందించింది.