సీరియల్ నేటి పవిత్ర త్రినయన ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. కన్నడ నటి అయినప్పటికీ సీరియల్స్ ద్వారా తెలుగు వాళ్లకు చాలా దగ్గర అయ్యారు. పవిత్ర మరణంతో ఇటు అభిమానులు, అటు సీరియల్ నటీనటులు దుఃఖపడ్డారు. అంతవరకు బాగానే ఉంది , కానీ పవిత్రకు బాగా దగ్గరగా ఉండే నటుడు చందు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. పవిత్ర గురించి పదే పదే పోస్టులు పెడుతూ వచ్చారు . చివరకు పవిత్ర లేని లోటు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో చందు పవిత్రల ప్రేమ అజరామరం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తుతున్నాయి. ప్రేమ కోసం ప్రాణాన్ని ఇచ్చిన త్యాగమూర్తి అంటూ పొగుడుతున్నారు.
హైదరాబాద్ శివారు అల్కాపూర్ కాలనీలో సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. చాలా సీరియల్స్ లో ఆయన నటించాడు. పవిత్ర ఎపిసోడ్లో ఆయన బాగా పాపులర్ అయ్యాడు.
ప్రస్తుతం రాధమ్మ కూతురు , కార్తీక దీపం సీరియల్స్‌లో చందు నటిస్తున్నాడు.ఇటీవలే త్రినయని సీరియల్ నటి పవిత్ర రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర తో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. చందు ఆమె మృతిని తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు చందు కి ఇంతకుముందే పెళ్లయింది అది కూడా ప్రేమ వివాహమే.
శిల్ప అనే అమ్మాయి నా ప్రేమించమంటూ కాలేజీ రోజుల లో 3 ఏళ్లు వెంటపడ్డాడు, శిల్పా ఒప్పుకున్న తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఒప్పించుకొని వివాహం చేసుకున్నారు. పిల్లలు కూడా పుట్టారు అంతవరకు సంసారం సాఫీగానే సాగింది. శిల్పా ఇప్పటికే ఉద్యోగం చేస్తుండగా భర్తకు కూడా ఉద్యోగం ఏర్పాటు చేయించింది కానీ అది వదిలిపెట్టి చందు సీరియల్స్ బాట పట్టాడు.
త్రి నైని సీరియల్లో పవిత్ర పరిచయం తర్వాత చందు లో మార్పు వచ్చింది అని చెప్తున్నారు. విడాకులు కావాలంటూ శిల్పాను చిన్న పిల్లల్ని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. 10 ఏళ్ల పెద్ద వయసున్న పవిత్ర చుట్టూ తిరుగుతూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. పవిత్ర పిల్లలే తన పిల్లలంటూ కాలేజీ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సంతకాలు పెట్టినట్లు తెలుస్తోంది.
పవిత్ర మాత్రం ఏ రోజు చందు గురించి బయట పెట్టలేదు సీరియల్స్ లో తన కెరీర్ మీద బాగా దృష్టిపెట్టేవారు . కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో ఎక్కువ అవకాశాలు దక్కించుకున్నారు. గ్లామర్ రంగం కాబట్టి అందరితో కలుపుగోలుగా ఉంటూ, అవకాశాలు అంది పుచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ సమయంలో రోడ్డు యాక్సిడెంట్ తో అర్ధాంతరంగా పవిత్ర చనిపోయారు ఆమె మృతదేహానికి బెంగళూరు నుంచి వచ్చిన భర్త అంత్యక్రియలు జరిపించి పిల్లలను తీసుకుని వెళ్ళిపోయారు. హైదరాబాదులో మాత్రం చందు ఈ వేదన భరించలేనంత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొత్తం మీద పవిత్ర చందు కథలో కూడా టీవీ సీరియల్స్ మాదిరిగా చాలానే ట్విస్ట్ లు ఉన్నాయి.