గంజాయికి వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో గంజాయి వినియోగానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో గంజాయి వినియోగం యువత భవిష్యత్తుని నాశనం చేయడమే కాకుండా ఏకంగా ప్రాణాలను కూడా తీస్తోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విజయవాడ సమీపంలో గంజాయి మత్తులో జరిగిన చిన్న గొడవ ఏకంగా అజయ్ సాయి అనే యువకుడి ప్రాణాలు తీసింది. మరో 5 గురిని హంతకులను చేసింది. దీనికి ఈ ప్రభుత్వ సమాధానం ఏంటి? అంటూ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు.
వాడవాడలా విస్తరిస్తున్న గంజాయిపై ప్రభుత్వంపై ఎందుకు ఇంత ఉదాసీనతఉందనీ, ఒకసారి గంజాయికి అలవాటు పడిన వారి జీవితం ఎంత ప్రమాదంలోకి వెళ్తుందో అధికారులు అర్థం చేసుకోరా? ఈ ఉదాసీనత వల్ల గంజాయి మహమ్మారి మన బిడ్డల వరకు వస్తుంది అని మర్చిపోకండి. పక్కా ప్రణాళికతో గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపండి. అంటూ గంజాయి వద్దు బ్రో అనే నినాదంతో చంద్రబాబు ట్వీట్ చేశారు.
https://twitter.com/ncbn/status/1655798736772288512?s=20