ఉద్యోగాల కోసం దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్ కతా బెంగళూరు వంటి నగరాలలో మన యువత ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ నెగ్గుకొని రావాలంటే తెలుగు, తమిళం వంటి మాతృభాషల తో పాటు హిందీ, ఇంగ్లీష్ తప్పనిసరి. అనేక భాషల మీద పట్టు ఉన్నవాళ్లే .. ఉద్యోగాలలో రాణిస్తున్నారు అనేది అక్షర సత్యం.
……..
దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వము కొంతకాలంగా త్రిభాషా సూత్రం అమలు చేస్తోంది. అంటే తెలుగు, తమిళం, కన్నడం వంటి మాతృభాషల తో పాటు… హిందీ, ఇంగ్లీష్ తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచిస్తోంది. ఫలితంగా విద్యార్థులు… పెద్ద వాళ్ళు అయ్యాక ఉద్యోగాలు వ్యాపారాలలో రాణించగలుగుతారు.
………….
కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్ష పార్టీలు దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. హిందీ భాష మనకు వద్దు అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల మీద ఉత్తరాది పెత్తనం ఎందుకు అని ఆయన కాంట్రావెర్సి లేవనెత్తారు. కానీ ఈ వాదనలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. పిల్లలకు మాతృభాష ఎంత ముఖ్యమో హిందీ ఇంగ్లీష్ తో పాటుగా ఇతర భాషలు కూడా అవసరమని ఆయన తేల్చి చెప్పారు. పది భాషలు నేర్చుకున్న వాళ్ళు అంతకన్నా గొప్ప వాళ్ళు అవుతారని ఉదాహరణలతో సహా చంద్రబాబు వివరించారు.
…….
అయితే స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం హిందీని వ్యతిరేకిస్తున్నారు. పిల్లలకు మూడు భాషలు వద్దంటూ పిల్లల భవిష్యత్తును అడ్డుకుంటున్నారు. రాజకీయాల కోసం పిల్లల్ని బలిపెట్టవద్దని బిజెపి ఎంపీ రఘునందన్ రావు హితవు పలుకుతున్నారు.
….
అటు విద్యావేత్తలు,, సామాజిక పరిశోధకులు కూడా పిల్లలకు అనేక భాషలు నేర్పించాలని సూచిస్తున్నారు. అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు అర్థం చేసుకోవచ్చు.