ఏపీ పాలనలో మోదీ మార్కు ప్రణాళిక..
కొంత కాలం క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అంతేగాకుండా దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా వారణాసి వంటి పుణ్యక్షేత్రాలలో అద్భుతమైన మార్పులు తీసుకొని రాగలిగారు. పచ్చదనం పరిశుభ్రత తో ప్రజలకు ఆరోగ్యం, ఆహ్లాదం కలుగుతుందని నరేంద్రమోదీ నిరూపించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆయనకు ప్రశంసలు లభించాయి.
….
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే తరహాలో అడుగులు వేస్తున్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రతీ నెల మూడో శనివారం నాడు క్రమం తప్పకుండా పరిశుభ్రతా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు ఇచ్చారు. ఆ రోజు ప్రభుత్వ యంత్రాంగం మొత్తంగా అదే పనిలో ఉండాలని ఆయన అంటున్నారు.
….
…..
మరో వైపు, ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం తాను కట్టుబడి ఉన్నానని “ఎక్స్ “వేదికగా ఆయన ప్రకటించారు. “రాష్ట్రమే ఫస్ట్.. ప్రజలే ఫైనల్’”అనే నినాదాన్నిచంద్రబాబు ఎంచుకొన్నారు. ప్రతిక్షణం ప్రజలకు మంచి చేసేందుకు పనిచేస్తున్నామని అన్నారు. చేయాల్సింది ఎంతో ఉందనే బాధ్యతను గుర్తెరిగి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. ప్రజల ఆశీస్సులు, భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర – 2047 విజన్‌తో ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ 1 గా నిలబెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆరు నెలల పాలనపై ఆయన తన “ఎక్స్ ఖాతా” లో ఈ మేరకు ట్విట్ చేశారు.
….
మొత్తం మీద చంద్రబాబు తీసుకొంటున్న కార్యాచరణ మీద అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమిలోని మూడు పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగేందుకు వీలుగా నరేంద్రమోదీ మార్కు పరిపాలన మీద ఆయన దృష్టి పెడుతున్నారు.