కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కంటతడి పెట్టారు.జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా అంబర్‌పేటలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.కేంద్ర మంత్రి అయ్యానన్న సంతోషం కన్నా అంబర్ పేటకు దూరమయ్యానన్న బాధే ఎక్కువగా ఉందని అన్నారు. అంబర్‌పేటకు వస్తుంటే చాలా రోజుల తరువాత తల్లిచెంతకు చేరిన బిడ్డలా ఫీలవుతున్నానని అన్నారు. తాను ఢిల్లీలో ఉన్నా అంబర్ పేట బిడ్డనేనని కిషన్ రెడ్డి అన్నారు.