పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతెంతో శ్రమిస్తూ ఉంటారు. భారతీయ సమాజంలో పిల్లల కోసం డబ్బు దాచి పెట్టడం సహజం. తల్లిదండ్రులు తమ అవసరాలను తగ్గించుకొని కూడా.. పిల్లలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రయత్నం చేస్తారు. ఇటువంటి తల్లితండ్రుల ఆశలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని తీసుకొని వచ్చింది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పేరు వాత్సల్య. భారత పౌరులతో పాటు ఎన్ఆర్ఐలు, ఓవర్సీస్ సిటిజెన్స్లూ తమ పిల్లల పేరున వాత్సల్య ఖాతాలు ప్రారంభించవచ్చు. ఏడాదికి కనీసం రూ. 1,000 జమ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. గరిష్ఠ పరిమితంటూ ఏమీ లేదు. కుటుంబ సభ్యులు ఎంత వీలైతే అంత మొత్తాన్ని దాచి పెట్టవచ్చు.
ఈ పథకం లో ఇతర లాభాలు కూడా ఉన్నాయి.ఈ పొదుపు ద్వారా దాచి పెట్టిన డబ్బుకి తల్లిదండ్రులు పన్ను మినహాయింపు పొందవచ్చు. ప్రస్తుతం 80సీ కింద లభిస్తున్న రూ.1.50లక్షల మినహాయింపునకు ఇది అదనం. సెక్షన్ 80 సీసీడీ కింద రూ.50వేల వరకూ అదనంగా పన్ను మినహాయింపు లభిస్తుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత అప్పటివరకూ పొదుపు చేసిన సొమ్ములో 60శాతాన్ని ఏకమొత్తంగా వెనక్కి తీసుకోవచ్చు.
ఇక్కడే తల్లిదండ్రులకు ఉపయోగపడే మరో సదుపాయం కూడా ఉంది . 60 ఏళ్ల తర్వాత మిగిలిన మొత్తాన్ని సాధారణ పెన్షన్ చెల్లింపుల రూపంలో ఇస్తారు. పిల్లల్లో పొదుపు, ఆర్థిక బాధ్యతలపై అవగాహన కల్పించడం ఈ పథకం ఆశయాలు అని చెప్పవచ్చు.
సామాజిక భద్రతకు కేంద్రం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం వాత్సల్య పథకాన్ని తీసుకొచ్చింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్…పీపీఎఫ్ ,, సుకన్య సమృద్ధి యోజన, తదితర పథకాల తరహాలోనే దీన్ని తీసుకువస్తున్నారు.
నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఏడాదికి 10, 12 వేలు దాచిపెట్టినట్లయితే అద్భుతమైన ఆదాయం తీసుకోవచ్చు. చిన్నపిల్లలకు మైనారిటీ తీరగానే 20 శాతం దాకా వెనక్కి తీసుకోవచ్చు. మీరు డబ్బుని ఫండ్స్ రూపంలోకి మళ్ళిస్తారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం చూసినట్లయితే సుమారు 10 కోట్ల దాకా ఆదాయాన్ని వెనక్కి తీసుకోవచ్చు.
మధ్యతరగతి ప్రజల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన అద్భుతమైన అవకాశం ఇది .