కేంద్రం సంచలన నిర్ణయం.. మదర్సాలలో రామాయణం,భగవద్గీత..!
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై మదర్సాలలో కూడా రామాయణం, భగవద్గీత ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) కింద నూతన కోర్సును ప్రవేశపెడుతోంది. దీనిలో భాగంగా 100 మదర్సాలలో ప్రాచీన భారతం, సంప్రదాయాలపై ప్రత్యేక తరగతులను బోధించనున్నారు. మూడు, ఐదు,ఎనిమిదో తరగతుల సబ్జెక్టులలో ప్రత్యేక పాఠ్యాంశాలుగా రామాయణం, భగవద్గీత ఉంటాయి. ఇందుకోసం ప్రత్యేకంగా పలు ఆర్టికల్స్‌ను కూడా రెడీ చేశారు. వీటిలో వేదాలు, భగవద్గీత,రామాయణం, యోగా,సైన్స్, సంస్కృతం ఉన్నాయని సమాచారం. అయితే ప్రస్తుతం 100 మదర్సాలలో మాత్రమే ఈ కోర్సును ప్రవేశపెడుతున్నామని.. భవిష్యత్తులో 500 మదర్సాలలో ఈ కోర్సును తీసుకెళ్లబోతున్నట్లు ఎన్ఐఓఎస్ చైర్మన్ తెలిపారు.