జాయింట్ పార్లమెంటరీ కమిటీ 81 సవరణలు సూచించడంతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును ఉపసంహరించుకుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫారసుల మేరకు కొత్త బిల్లును తీసుకురావడానికి కేంద్రం ఇప్పుడు సమగ్ర చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ పై కసరత్తు చేస్తోంది. సోషల్ మీడియా కంపెనీలు, డేటా కార్యకర్తలతో పాటు అందరు వాటాదారులతో తాజా సంప్రదింపులు జరుపుతామని యూనియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో తెలిపారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
పౌరుల వ్యక్తిగత డేటాకు రక్షణ కల్పించాలని.. డేటా ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 2019 డిసెంబర్ లో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉందని కాంగ్రెస్, టీఎంసీలు వ్యతిరేకించాయి. ఆ తర్వాత క్షుణ్ణంగా పరిశీలించడానికి పార్లమెంటు జాయింట్ కమిటీకి పంపారు.