కేంద్ర ప్రభుత్వం సాగరమథనానికి సిద్ధమవుతోంది. సముద్ర గర్భంలో దాగిన సంపదను గుర్తించి వెలికితీయాలనుకుంటోంది. అనంతమైన సహజవనరుల్ని సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో 7,517 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. ఇక 1,382 ద్వీపాలున్నాయి. ఆ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునే ఉద్దేశంతో ‘డీప్ ఓషన్ మిషన్’ కు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో 4 ,077 కోట్లు ఖర్చు పెట్టనున్నారు.