టీకా ధరలపై విమర్శలు తలెత్తిన వేళ ధరలు తగ్గించాలని వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలైన సీరం ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ లను కోరింది కేంద్ర ప్రభుత్వం. ఆయా సంస్థలు తాము తయారు చేస్తున్న టీకాలు కోవిషీల్డ్, కోవాక్సిన్ ధరల్ని ఇప్పటికే ప్రకటించాయి. కేంద్రానికి అందిస్తోన్న ధరలతో పోలిస్తే రాష్ట్రాలకు, ప్రైవేట్ ఆస్పత్రులకు ఎక్కువ ధర ఉండడంపై విమర్శలు వచ్చాయి. దీంతో ధరలు తగ్గించాలని ప్రభుత్వం కోరింది. ఈమేరకు కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా అధ్యక్షతనసమావేశం జరిగింది. త్వరలోనే ఆ రెండు కంపెనీలు సవరించిన ధరలను ప్రకటించే అవకాశం ఉంది.
కోవాగ్జిన్ టీకాను రాష్ట్రప్రభుత్వాలకు డోసుకు 6 వందలుగా నిర్ణయించగా…ప్రైవేట్ ఆస్పత్రులకు 12 వందల రూపాయలని ప్రకటించింది. సీరం సంస్థ తన టీకాను 4 వందల రూపాయల చొప్పున రాష్ట్రానికి, ప్రైవేట్ ఆస్పత్రులకు 6 వందల రూపాయల చొప్పున ప్రకటించింది. ఈ రెండు సంస్థలూ కేంద్రానికి మాత్రం 150 రూపాయలకు అందివ్వనున్నాయి. వేర్వేరు ధరలపై అభ్యంతరాలు, విమర్శలు వస్తున్న తరుణంలో కేంద్రం ధరలు తగ్గించాలని కేంద్రం ఆయా సంస్థలను కోరింది.