
file photo
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరోబెన్ మోదీ కన్నుమూతపట్ల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంతాపం తెలిపారు. ”కన్నతల్లిని కోల్పోవడం కంటే పెద్ద నష్టం మరొకటి ఉండదు. తల్లిని కోల్పోయి దుఃఖంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి నా సంతాపం తెలియజేసున్నాను” అని ఆయన ట్వీట్ చేశారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడ కూడా
ట్వీట్ ద్వారా సంతాపం తెలిపారు. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ సైతం తల్లిని కోల్పోయిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.నేపాల్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబ, శ్రీలంక మాజీ ప్రధాని మహేంద్ర రాజపక్స సైతం తల్లిని కోల్పోయిన భారత ప్రధాని మోదీకి సంతాపం తెలియజేశారు. భారత్లో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ ఒక సంతాపం సందేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి, ఆయన ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.