ఆర్ఎస్ఎస్ కార్యకర్తను కిరాతకంగా హత్య చేసిన నిందితుడికి బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త జాని తొట్టతి మనోజ్ హత్య, ప్రమోద్ పై హత్యాయత్నం చేసినట్టు సీపీఐ సభ్యులపై కేసు నమోదైంది. అయితే నిందితులకు కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ని సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది.
న్యాయమూర్తులు ఎస్ఎం కౌల్, ఎంఎం సుందరేశ్ లతో కూడిన ధర్మాసనం…కేసు వాస్తవ నిర్థారణలపై తమకు అభ్యంతరం ఉందని…ఏడాదినుంచి సీబీఐకేసును ముందుకు తీసుకెళ్లలేదని వ్యాఖ్యానించింది. అయితే సీబీఐ తమ వాదనలు వినిపించింది. విచారణ లేకుండానే నిందితులు జైల్లో ఉన్నారని… సీబీఐ నుంచి ఎలాంటి జాప్యం జరగలేదని…2021లో కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని ప్రీమియర్ దర్యాప్తు సంస్థ వాదించింది.
నిందితులు నేరానికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలినా కేరళ హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసిందని సీబీఐ వాదించింది. నిందితులైన సీపీఐ సభ్యులు ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్తను ఘోరంగా హత్యచేయడంతో పాటు…మరో కార్యకర్తలపై హత్యాయత్నం చేశారన్న అభియోగాలున్నాయని పిటషన్లో పేర్కొంది. అంతేకాదు మనోజ్ హత్యకు వాడిన బాంబులు, కత్తులు, వాడిన హెలికాఫ్టర్ ను చూస్తే వారిని లక్ష్యంగా చేసుకునే కుట్రపన్నినట్టు తేలిందని చార్జిషీట్లో పేర్కొంది సీబీఐ. ప్రాథమిక చార్జిషీట్లో 19మందిని నిందితులుగా పేర్కొనగా…తరువాత మరో ఆరుగురిని నిందితులుగా పేర్కొంటూ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశారు.
2015 మార్చిలో కోర్టు ఈ కేసును పరిగణనలోకి తీసుకుంది. అప్పటినుంచి సీబీఐ స్పెషల్ జడ్జిముందు విచారణ పెండింగ్ లో ఉంది. నిందితులు 2015నుంచి 2018 వరకు అనేక దరఖాస్తులు చేశారని… వారిపై ఆరోపణలు నిజమని తేలడంతో మెరిట్ల ఆధారంగా వాటిని తిరస్కరించినట్టు సీబీఐ పేర్కొంది.