
File Photo
బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మీమ్స్ వీడియోలు పోస్ట్ చేసిన యూట్యూబ్ చానళ్లపై కోల్ కతా పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎంపై అసభ్యకరమైన వీడియోలు చేస్తున్నారంటూ సాగర్ దాస్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుతో పోలీసులు చర్యలకు దిగారు. ఆమె ప్రసంగాల్లోని కొన్ని బిట్స్ తీసుకుని అసభ్యంగా ఎడిటింగ్ చేశారంటూ కొన్ని చానళ్ల పేర్లను మెన్షన్ చేస్తూ దాస్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయా చానళ్లపై కేసులునమోదు చేశారు.