వారణాశిలోని జ్ఞానవాపి శివలింగాన్ని కార్బన్ డేటింగ్ ద్వారా నిర్థారించాలంటూ దాఖలైన పిటిషన్ ను జిల్లా కోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు
శివలింగం వంటి నిర్మాణాన్ని యథాతథంగా కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. ఈ శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయించాలన్న వాదనను ముస్లిం పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాయి ఆర్గానిక్ పదార్థం కాదని… కార్బన్ డేటింగ్ సాధ్యం కాదని… అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ వాదించింది.
జ్ఞానవాపి ప్రాంగణంలో నిర్వహించిన సర్వేలో శివలింగం కనిపించడం…ఆ ప్రదేశాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో శివలింగం కాలాన్ని నిర్ధారించడానికి కార్బన్ డేటింగ్ లేదా ఇతర సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయాలని కొందరు పిటిషన్ వేశారు. అయితే అది శివలింగమే కాదని… ఫౌంటెన్ అని వాదిస్తున్నాయి ముస్లిం సంఘాలు. కార్బన్ డేటింగ్ చేయాలన్ని హిందువుల వాదనను…ప్రస్తుతం ఆ మసీదును పర్యవేక్షిస్తున్న అంజుమన్ ఇంతెజామియా కమిటీ వ్యతిరేకించింది.
ఇరు పక్షాల వాదనలు విన్న వారణాసి జిల్లా కోర్టు జడ్జి…ఏకే విశ్వేశ హిందువుల అభ్యర్థనను తోసిపుచ్చారు. ‘శివలింగం’ వయసు, దాని స్వభావాలను నిర్థరించాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించడం సరైనది కాదని..అసలా వ్యాజ్యంలోని ప్రశ్నలకు సమాధానాలను ఈ ఆదేశాల ద్వారా నిర్థరించడం సాధ్యం కాదనీ స్పష్టం చేశారు.
Gyanvapi Mosque issue: Varanasi Court rejects Hindu side's demand seeking carbon dating and scientific investigation of 'Shivling' in the mosque complex#UttarPradesh pic.twitter.com/UdFFgZz3Bj
— ANI (@ANI) October 14, 2022