మహిళలకు గుడ్ న్యూస్. గర్భాశయ కేన్సర్ కు వాక్సిన్ వచ్చేసింది.దేశీయంగా అభివృద్ధి చేసిన క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ ను డిల్లీలోని ఐఐసీలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిజితేంద్రసింగ్ ఈ వాక్సిన్ ప్రారంభించారు.వాక్సిన్ తయారీ భారతదేశ వైద్యచరిత్రలో ఓ మైలురాయని చెప్పవచ్చు. 90 శాతం గర్భాశయ క్యాన్సర్ నిర్దిష్ట వైరస్ వల్ల వస్తుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను తయారు చేసే బాధ్యతను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గత నెలలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకుఅప్పగించింది. 9 నుంచి 14 సంవత్సరాల లోపు బాలికలకు ఈ గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ ను జాతీయ ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో భాగంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
https://twitter.com/DrJitendraSingh/status/1565255083419267072?s=20&t=zPqdPeeqbE9ud75UblwZbQ
https://twitter.com/ANI/status/1565248714293538816?s=20&t=zPqdPeeqbE9ud75UblwZbQ