స్వచ్ఛంద సంస్థల ముసుగులు మతమార్పిడులకు పాల్పడటం క్రైస్తవ మిషనరీలకు బాగా అలవాటు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఊర్లో ను చర్చిలు పెట్టి విస్తారంగా మతమార్పిడులకు పాల్పడుతున్నారు. స్వచ్ఛంద సంస్థల ముసుగులో విదేశాల నుంచి భారీగా విరాళాలు స్వీకరించి,, ఆ డబ్బుతో మభ్యపెట్టి మత మార్పిడిలు చేయడం మిషనరీ సంస్థలు అలవాటు.
అడ్డగోలుగా ప్రవర్తిస్తున్న ఇటువంటి మిషనరీల మీద చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఇప్పటికే 20 వేలకు పైగా ఎన్జీవోల లైసెన్స్ లను రద్దు చేసినట్లు వివరించింది.
వెబ్‌సైట్‌లోని ఎంహెచ్ఏ డాష్‌బోర్డ్ ప్రకారం, ప్రస్తుతం ఎఫ్సిఆర్ఏ లైసెన్స్‌తో మొత్తం 16,026 సంఘాలు క్రియాశీలంగా ఉన్నాయి. అంతకు ముందు మొత్తం 20,711 సంస్థల లైసెన్స్‌లు రద్దు చేశారు. ఇటీవలి సంవత్సరాలలో ఎఫ్సిఆర్ఏ లైసెన్స్‌లను రద్దు చేసిన ఎన్జీఓల జాబితాలో గణనీయమైన పెరుగుదల ఉంది.
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో, మూడు చర్చి ఆధారిత స్వచ్ఛంద సంస్థలతో సహా ఐదు ఎన్జీఓల ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.
సిఎన్‌ఐ సైనోడికల్ బోర్డ్ ఆఫ్ సోషల్ సర్వీస్, వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండో-గ్లోబల్ సోషల్ సర్వీస్ సొసైటీ, చర్చి ఆక్సిలరీ సోషల్ యాక్షన్ , ఎవాంజెలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా (ఈఎఫ్ఐ) సంస్థల లైసెన్సులను రద్దు చేశారు. ఫిబ్రవరిలో తమిళనాడు కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలోని క్రిస్టియన్ ఎన్జీఓ తమిళనాడు సోషల్ సర్వీస్ సొసైటీ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్‌ను ఎంహెచ్ఏ రద్దు చేసింది. కేవలం ఒక నెల ముందు, ఎంహెచ్ఏ తమిళనాడుకు చెందిన క్రిస్టియన్ అసోసియేషన్ వరల్డ్ ఇండియా విజన్ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. . జూలైలో, సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీని నడుపుతున్న ఇన్స్టిట్యూట్ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ రద్దు చేసింది.
వాస్తవానికి విదేశాల నుంచి నిధులు పొందుతున్న స్వచ్ఛంద సంస్థలు మతమార్పిడులకు పాల్పడకూడదు అని స్పష్టంగా చట్టాలలో రాసి ఉంది. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో మిషనరీలు చెలరేగిపోయాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మతమార్పిడిల మీద ఉక్కు పాదం మోపుతుండడంతో ఈ అరాచకాలకు అడ్డుకట్ట పడుతున్నది.