కాంగ్రెస్ పార్టీ మోసం బయట పడిపోయింది. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాల గుట్టు రట్టు అవుతోంది. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం… రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచుతోంది.
……..
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం దివాళా దిశగా పరుగులు తీస్తోంది. అప్పుల కోసం కాంగ్రెస్ సర్కారు ఊరు వాడ తిరుగుతోంది. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరం అని
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తాజా నివేదిక హెచ్చరించింది. రాష్ట్రం అప్పులను నిగ్గదీసి తెలిపే సంస్థగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ని చెబుతారు.
ఐదు గ్యారెంటీల అమలు కోసమని ఒక్క సంవత్సరం లోనే రూ. 63 వేల కోట్లను కర్ణాటక ప్రభుత్వం అప్పుగా తీసుకొన్నట్టు కాగ్ తెలిపింది.
అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది రూ. 37 వేల కోట్లు ఎక్కువని వెల్లడించింది. అంటే ప్రతి ఏడాది అప్పులు రెట్టింపు అవుతున్నాయి అన్నమాట.
అప్పులు పెరిగిపోవడం, రాబడి పడిపోవడంతో కర్నాటక ఆర్థిక పరిస్థితి ఎంతమాత్రం బాగోలేదని కాగ్ హెచ్చరించింది. గ్యారెంటీలకే మెజార్టీ నిధులను కేటాయిస్తుండటంతో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది అని కాగ్ పేర్కొంది. ఒకవైపు గ్యారెంటీల అమలుకు వేల కోట్ల రూపాయలను అప్పులు చేస్తున్న ప్రభుత్వం.. ఆ నిధులు సద్వినియోగం చేయటం లేదు.
…….
గ్యారెంటీల పేరిట అప్పులుగా తెచ్చిన సొమ్మంతా ప్రభుత్వ పెద్దలు పక్కదారి పట్టిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఐదు గ్యారెంటీల అమలుకు కర్ణాటక ప్రభుత్వం ఏటా రూ.63 వేల కోట్ల వరకు నిధులు కేటాయించాల్సి వస్తున్నది. దీంతో కొత్తగా అప్పులు చేస్తున్నది. మొత్తం మీద అప్పులు తెచ్చి కాంగ్రెస్ పెద్దలు జల్సా చేస్తున్నారని కర్ణాటక ప్రజలు మండిపడుతున్నారు. త్వరలోనే రాష్ట్రాన్ని దివాలా తీస్తారని భయపడుతున్నారు.
………
కర్ణాటక బాటలోనే భారీ భారీ హామీలు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే హామీలు అమలు చేయలేక బిత్తర చూపులు చూస్తోంది. తాజాగా జీఎస్టీ సవరణలతో తెలంగాణ పరిస్థితి అద్వానంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కర్ణాటక పరిస్థితి బట్టబయలు అయింది ,, తెలంగాణ పరిస్థితి గుంభనంగా ఉంది అనుకోవచ్చు.