మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన టీమిండియా ఆటగాళ్లను హీరో ఎన్టీఆర్ కలిశాడు. టీమిండియా ఆటగాళ్లలో ఉన్న తన స్నేహితులను విందుకు ఇంటికి పిలిచిన నగరవాసి నజీర్ ఖాన్….ఎన్టీఆర్ ను సైతం ఆహ్వానించారు. దీంతో అంతా కాసేపు సందడి చేశారు. ఆటగాళ్లు ఎన్టీఆర్ తో ఫొటోలు దిగి సోషల్మిడియాలో షేర్ చేశారు. ఇటీవల ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో క్రికెటర్లు ఆయనను అభినందించారు. భార్య దేవిషా శెట్టితో కలిసి ఎన్టీఆర్ తో దిగిన ఫొటోను సూర్యయాదవ్ ట్విట్టర్లో షేర్ చేయగా రేపటి మ్యాచ్లో అదరగొట్టాలి అంటూ కామెంట్ పెట్టాడు ఎన్టీఆర్