బిజెపి ఫైర్ బ్రాండ్ ఎంపీ కంగానా రనౌత్ ఏమి చేసినా సుచలనమే. తాజాగా సరి కొత్త సినిమా తో కలకలం రేపుతున్నారు. . దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఎమర్జెన్సీ పేరుతో ఆమె ఒక సినిమా తీశారు. ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటించటమే కాకుండా, దీనికి ఆమె దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గతేడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వలన వాయిదా పడింది. అయితే రీసెంట్గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 17న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను కూడా పంచుకుంది. అయితే ఈ సినిమా విడుదలకు ఇంకా 10 రోజులే ఉండడంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నారు కంగనా.
ఇక్కడే కంగానా ఒక బాంబు పేల్చారు. ప్రమోషన్ క్రమంలోనే ‘ఎమర్జెన్సీ’ సినిమాను ఇద్దరం కలిసి చూద్దాం రమ్మంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీని ఆహ్వానించారు. ఈ మూవీకి ప్రియాంకాను ఆహ్వనించడంపై కంగనా మాట్లాడుతూ, ఇటీవల పార్లమెంటులో ప్రియాంక గాంధీని కలిశాను. ఆమెని కలిసిన అనంతరం నేను చెప్పిన మొదటి మాట.. ఆప్కో ఎమర్జెన్సీ దేఖ్నీ చాహియే (మీరు ఎమర్జెన్సీ సినిమాని చూడాలి). మీకు ఇది బాగా నచ్చుతుంది అంటూ ప్రియాంకాకు చెప్పాను. ఇప్పుడు స్వయంగా ఆహ్వానిస్తునట్లు పేర్కొన్నారు.
మొత్తం మీద కంగానా చేసిన పని కలకలం రేకుతోంది.