యోగీ సీఎం అయినా బుల్డోజర్లు యూపీని వీడడం లేదు. ఎక్కడకెళ్లినా అవే చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక యూపీ ప్రయోగరాజ్ లో ఓ సామూహిక వివాహ వేడుకలో పెళ్లి చేసుకున్న దంపతులందరికీ వినూత్నంగా బుల్డోజర్లు బహుకరించారు చౌరాసియా సమాజ్ ప్రతినిధులు. అంటే అచ్చంగా మట్టిపనిచేసే బుల్డోజర్లు కాదనుకోండి. ప్రతిమల్ని, బొమ్మల్ని కానుకగా ఇచ్చారన్నమాట. యోగీ ప్రభుత్వంలో అందరికీ ముఖ్యంగా మహిళలకు రక్షణ ఉందని చాటేలా సింబాలిక్ గా వాటిని ఇచ్చినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. నేరాలకు పాల్పడేవారిపై, మాఫియాపై యోగీ సర్కారు బుల్డోజర్లు ఎక్కిస్తుందని ఎన్నికల్లో బీజేపీ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. యోగీ మొదటిసారి సీఎం అయినదగ్గర్నుంచే అక్రమకట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేస్తూ వచ్చారు. దాన్నే ప్రధాన ప్రచారంగా బీజేపీ వెళ్లగా…యోగీ పేరును బుల్డోజర్ గా మార్చేశారు అభిమానులు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)