2023-24 కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మల ఆకర్షణీయంగా కనిపించారు. భారతీయ సంప్రదాయ చీరలే ఎక్కువగా ధరించే ఆమె…ఈసారి సంప్రదాయ టెంపుల్ బోర్డర్ ఉన్న ముదురు ఎరుపు రంగుచీర ధరించారు. నూలు, పట్టు మిశ్రమంగా చేసిన నేత చీర అది. ఎర్రరంగు చీరపై నల్లరంగు బోర్డర్, గోల్డెన్ కలర్ వర్క్ ప్రత్యేక ఆకర్షణీయంగా ఉన్నాయి.