నలుగురు పాకిస్తానీ మత్స్యకారులను బీఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్నారు. గుజరాత్ లోని కచ్ సరిహద్దు సముద్రతీరంలో వారిని గుర్తించారు. ఇండో-పాక్ సరిహద్దు సమీపంలోని హరామి నల్లా దగ్గర పెట్రోలింగ్ చేస్తుండగా… బీపీ నంబర్ 1165, 1166 మధ్య కొన్ని పాకిస్థానీ ఫిషింగ్ బోట్లు భారత భూభాగంలోకి చొరబడుతున్నప్పుడు గుర్తించారు. అప్రమత్తమై ఆప్రాంతాన్ని చుట్టుముట్టి పడవలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆ ప్రాంతంలో జవాన్ల అన్వేషణ కొనసాగుతోంది. అయితే పడవల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులేం కనిపించలేదు.
A special ambush party of BSF Bhuj apprehended 4 Pak fishermen and seized 10 Pak fishing boats while they were sneaking into Indian territory through one of the water channels of Harami Nalla near Indo-Pak border in the Kutch district of Gujarat, early this morning: BSF pic.twitter.com/jBt9HINr2R
— ANI (@ANI) July 7, 2022