బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ప్రారంభమైంది. పార్టీ చీఫ్ కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. భారత రాష్ట్రసమితిగా పార్టీని జాతీయ పార్టీగా విస్తరించిన కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ విస్తరణపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఢిల్లీ, ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.