ఖాలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు అమృతపాల్ సింగ్ పై చర్యలు తీసుకున్నందుకు నిరసనగా బ్రిటన్ లో గల ఖాలిస్తాన్ సానుభూతి పరులు అయిన NRI లు భారత హై కమిషన్ భవనంపై దాడి చేసి, భవనం పై ఎగురుతున్న భారత జాతీయ పతాకాన్ని తీసేసి దాని స్థానంలో ఖాలిస్తాన్ జెండా ఎగురవేసే ప్రయత్నం చేశారు.
అయితే, అక్కడ మన ఎంబసీ లో పనిచేస్తున్న ఒక అధికారి వారి చర్యలను అడ్డుకున్నారు. వియేన్నా ఒప్పందం ప్రకారం విదేశీ ఎంబసీలకు అక్కడ పనిచేస్తున్న అధికారులకు తగిన రక్షణ కల్పించవలసిన బాధ్యత ఆతిధ్య దేశానిది, మీ ప్రభుత్వం భారత ఎంబసీ కి తగు రక్షణ కల్పించడం లో విఫలం అవ్వడం వల్లే ఈ సంఘటన జరిగింది అని భారత్ యూకే ప్రభుత్వానికి తీవ్ర నిరసన తెలియచేసింది. ఈ నిరసన తరువాత బ్రిటిష్ ప్రభుత్వం భారత్ ఎంబసీ భద్రత పెంచింది.
భారత్ అక్కడితో ఆగకుండా భారత్ జండాను అపవిత్రం చేయడానికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోమని బ్రిటన్ ని కోరింది. అంతేకాక ఆరోజు ప్రదర్శనలో పాల్గొన్న ఎన్నారై ల పేర్లు తెలియజేయమని కూడా కోరింది.
భారత్ కోరిన విధంగా ఆరోజు జెండా ఎగర ప్రయత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు తదుపరి, ఆరోజు ప్రదర్శనలు పాల్గొన్న వారి పేర్లు కూడా బ్రిటిష్ ప్రభుత్వం భారత్ కి అందజేసింది.
ఆ సమాచారం ఆధారంగా భారత విదేశాంగ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు వీరిపై భారత ఉగ్రవాద నిరోధక చట్టంతో సహా అనేక శిక్షా నిబంధనల ప్రకారం ఢిల్లీ పోలీసులు FIR నమోదు చేశారు.
భారతదేశ భద్రత మరియు సార్వభౌమత్వాన్ని బెదిరించే విధంగా విదేశీ గడ్డపై వారు చేసిన చర్యలకు మరియు భారత ప్రభుత్వం లేదా దాని ఏజెన్సీలకు చెందిన విదేశాల్లో గల అస్తిని పాడు చేయడం లేదా నాశనం చేయడంకు సంబంధించిన UAPA నిబంధనలను క్రింద FIR నమోదు చేశారు.
ఈ కేసు విచారణ లో ఆ రోజు హాజరైన వారి గుర్తించి వారి ప్రయాణ పత్రాలు, OCI స్టేటస్ మరియు భారతదేశంలోని వారికి గల ఆస్తులు అటాచ్మెంట్తో సహా ఇతర చర్యలు ఉంటాయి. దీనిపై విచారణ కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు.
….చాడా శాస్త్రి…..