హిందూ స్పిరిట్యువల్ అండ్ సర్వీస్ ఫౌండేషన్ (HSSF), ఇనిషియేటివ్ ఫర్ మోరల్ అండ్ కల్చరల్ ట్రైనింగ్ ఫౌండేషన్ (IMCTF) ఆద్వర్యం లో నిర్వహించిన బృహత్ మేళ సేవ ప్రదర్శని కార్యక్రమం సందడి గా ముగిసింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో
ఈ నెల 8 నుండి 10 వరకు ఘనంగా జరిగింది. ఈ ప్రదర్శనలో సేవాసంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, సేవావ్రతులైన వ్యక్తులు, మఠాలు మరియు మందిరాలు తమ సేవా కార్యక్రమాలను ప్రజలకు పరిచయం చేశాయి. 180 కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేసి, ఈ తరం యువతకు అవగాహన కల్పించారు.
నవంబర్ 7, గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభోత్సవం కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు మరియు సమాజానికి సేవచేసే ప్రముఖులు పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజాచార్య చినజీయర్ స్వామి మరియు రామకృష్ణ మిషన్ చీఫ్ శ్రీ శితికంఠానంద మహారాజ్ హాజరయ్యారు. సేవా కార్యక్రమాల కోసం ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందించాల్సిన విషయం అని అతిథులు అభిప్రాయపడ్డారు.
ఈ మూడు రోజుల ప్రదర్శనలో సాంస్కృతిక కార్యక్రమాలు, గీతాలు, నృత్య ప్రదర్శనలు, విద్యార్థులకు విజ్ఞాన కార్యక్రమాలు, ఆటలు పాటలు, ప్రేరణాత్మక ప్రసంగాలు నిర్వహించారు. నవంబర్ 8న బాలికలు, ప్రకృతి మరియు మహిళలను గౌరవించే కార్యక్రమాలు జరిగాయి. 9న గురువులు , ఉపాధ్యాయులకు సత్కరిస్తూ వందన కార్యక్రమం నిర్వహించి, విద్యావేత్తలు ప్రసంగించారు.\
మూడు రోజుల కార్యక్రమంలో ఉన్నతమైన మానవతా విలువలు, సంస్కృతులు, పర్యావరణ సంరక్షణ, విద్యా విలువలు, సేవాస్ఫూర్తి తదితర అంశాలపై వివిధ అంశాలతో విస్తృతంగా చర్చించారు. చివరగా, నవంబర్ 10న 21 మంది పరమవీరచక్ర వీరులను గౌరవిస్తూ పరమ వీర వందనం సమర్పించారు.
మూడు రోజుల సేవా ప్రదర్శిని కార్యక్రమం చక్కటి అనుభూతులు అనుభవాలు మధ్య ముగిసింది.