కేడర్, నియామకాలతో సంబంధం లేకుండా బ్రిగేడియర్, ఆపై స్థాయి అధికారులకు ఒకేవిధమైన యూనిఫాం తీసుకురావాలని భారత సైన్యం నిర్ణయించింది. కల్నల్ స్థాయి, ఆర్మీ కంటే తక్కువ స్థాయి అధికారుల యూనిఫాంలో ఎలాంటి మార్పు ఉండదు. ఫ్లాగ్ ర్యాంక్ సీనియర్ అధికారుల హెడ్‌గేర్, షోల్డర్ ర్యాంక్ బ్యాడ్జీలు, గోర్గేట్ ప్యాచ్‌లు, బెల్టులు, బూట్లు ఇకనుంచి ఒకేలా ఉంటాయి. ఆగస్టు 1 నుంచి ఈవిధానం అమల్లోకి రానుందని ఆర్మీవర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన ఆర్మీ కమాండర్ల సమావేశంలో దీనిపై విస్తృతచర్చ, సంప్రదింపులు జరిగినట్టు వివరించాయి. సీనియర్ లీడర్షిప్ మధ్య సర్వీస్ విషయాల్లో రెజిమెంటేషన్ పరిధులకు అతీతంగా కామన్ ఐడెంటిటీని ప్రోత్సహించడానికి, బలోపేతం చేయడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
The headgear, shoulder rank badges, gorget patches, belt and shoes of senior officers of flag rank (Brigadier and above) will now be standardised and common. The flag-rank officers will now not wear any lanyards. The changes will be implemented from August 1 this year. There is…
— ANI (@ANI) May 9, 2023