సోషల్మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉంటూ సందేశాత్మక పోస్టులు పెడుతుంటారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా. ముఖ్యంగా మన దేశానికి సంబంధించి, భారతీయుల ఘనత గురించి ఎక్కువగా షేర్ చేస్తుంటారాయన. ఇక ఇవాళ కూడా ఆసక్తికర ట్వీట్ చేశారు. దేశంలోనే అత్యంత ఎత్తైన ఫుట్ బాల్ స్టేడియం ఫొటోలను ఆయన ట్విట్టర్లో పంచుకున్నారు. ఆసక్తిరక వ్యాఖ్యనూ జతచేశారు. “ఈ చిత్రాలు చూస్తుంటేనే ఊపిరాగిపోతోంది. ఆక్సిజన్ లేక కాదు. (అది ఎత్తైన స్టేడియం)ఏదో ఒక రోజు అక్కడికెళ్తా..టీవీలో మాత్రమే కాక ఓ ఆదివారం నేరుగా అక్కడ కూర్చుని ఆట చూస్తా” అని ఆనంద్ ట్వీట్ చేశారు. అయితే ఆ స్టేడియం ఉన్నది జమ్ముకశ్మీర్లోనిది. కేంద్రపాలిత ప్రాంతం లద్దాక్ లో సముద్ర పట్టానికి 11వేల అడుగుల ఎత్తులో దాన్ని నిర్మించారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన మొదటి పది స్టేడియాల్లో ఇదొకటి. ఒకేసారి 30 వేలమంది కూర్చుని ఆటను వీక్షించవచ్చని ఓ మీడియా సంస్థ ట్వీట్ చేసింది. దానికి రీ ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా.
That view takes your breath away. And not because of oxygen depletion!! At some point in the future I want to be physically present at a Football match in that stadium on a Sunday, Instead of being a couch potato and watching cricket on TV! https://t.co/BxJoehTKjW
— anand mahindra (@anandmahindra) April 23, 2023