భారత్ ప్రవహించే బ్రహ్మపుత్రనది, రష్యాలో ప్రవహించే మోస్క్వా నది పేర్లు కలిపి బ్రహ్మోస్ అని పెట్టారు. 21 శతాబ్దపు అత్యాధునిక సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఇది. గంటకు 4300 కి.మీ వేగంతో దూసుకెళ్లి శత్రుస్థావరాలను ధ్వంసం చేయగలదు. ఇది 400 కి.మీ పరిధిలో శత్రువులను లక్ష్యంగా చేసుకుంటుంది.
నాలుగు రోజుల క్రితమే బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్ కు
బ్రహ్మోస్ ఏరోస్పేస్తో ఫిలిప్పీన్స్ 374 మిలియన్ డాలర్ల ఒప్పందం అదే సమయంలో, ఇటీవల ఫిలిప్పీన్స్ తన నౌకాదళం కోసం తీరంలో మోహరించే యాంటీ షిప్ క్షిపణుల సరఫరా కోసం బ్రహ్మోస్ ఏరోస్పేస్తో $ 374 మిలియన్ల ఒప్పందంపై సంతకం చేసింది. ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి తన నౌకాదళం కోసం సముద్ర తీరంలో మోహరించే యాంటీ షిప్ క్షిపణులను సరఫరా చేయడానికి కంపెనీ ఆఫర్ చేసినట్లు వర్గాలు తెలిపాయి. గత నెలలో అక్కడి ప్రభుత్వం 374 మిలియన్ డాలర్ల ప్రతిపాదనను ఆమోదించిందని ఆయన చెప్పారు. లడఖ్ మరియు అరుణాచల్ ప్రదేశ్‌లోని చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి వివిధ వ్యూహాత్మక ప్రదేశాలలో భారతదేశం ఇప్పటికే భారీ సంఖ్యలో బ్రహ్మోస్ క్షిపణులను మోహరించింది.
ఇక ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ క్షిపణులను భారత్ ఎగుమతి చేయనుంది. ఈ మేరకు 374 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నాయి ఇరుదేశాలు. రక్షణరంగానికి సంబంధించి కీలక, అతిపెద్ద ఎగుమతి ఒప్పందంగా దీన్ని చెప్పవచ్చు.
“ఫిలిప్పీన్ నేవీ తీర ఆధారిత యాంటీ-షిప్ క్షిపణి కొనుగోలు ప్రాజెక్ట్ కోసం ఇటీవలే నోటీసు ఆఫ్ అవార్డ్‌పై సంతకం చేశాం. ఈ ఐఎల్ఎస్ ప్యాకేజీలో మూడు బ్యాటరీల డెలివరీ, ఆపరేటర్లు , నిర్వహణదారులకు శిక్షణతో పాటు అవసరమైన ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ సపోర్ట్‌ను ఉంటుంది.”అని ఫిలిప్పీన్స్ జాతీయ రక్షణ కార్యదర్శి డెల్ఫిన్ లోరెంజానా ఫేస్బుక్ పోస్ట్‌లో పోస్ట్ చేశారు. ఫిలిప్పీన్స్ జాతీయ రక్షణ విభాగం కూడా తన వెబ్సైట్లో కాంట్రాక్ట్ అవార్డు నోటీస్ కాపీని పోస్టు చేసింది.
గతేడాది , భారత్… ఫిలిప్పీన్స్, మనీలాకు రక్షణ పరికరాలను ఎగుమతి చేయడానికి వీలు కల్పించే రక్షణ ఒప్పందంపైనా సంతకం చేశాయి. వియత్నాం, ఇండోనేషియాతో సహా ఆగ్నేయాసియాలోని ఇతర దేశాలు కూడా భారత్ నుంచి బ్రహ్మోస్ లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. రక్షణరంగ ఎగుమతుల్లో ఫిలిప్పీన్స్ తో భారత్ చేసుకున్న తాజా ఒప్పందం అతి కీలకమైందని చెప్పవచ్చు. ఆగ్నేయాసియా దేశాలకు బ్రహ్మోస్ ను ఎగుమతి చేస్తున్నామంటే ఒకరకంగా పక్కలో బల్లెంలా మారిన సరిహద్దు దేశం చైనాకు గట్టి సంకేతం ఇవ్వడమే. దక్షిణచైనా సముద్ర జలాల విషయంగా కానీ, సరిహద్దు విషయంగా కానీ ఆయా దేశాలతో చైనాకు వివాదాలున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందంపై ఇంతవరకు చైనా ఏ విధంగానూ స్పందించలేదు.
BrahMos supersonic cruise missile, with enhanced capability, successfully test-fired off Odisha coasthttps://t.co/7L758zZ2qy pic.twitter.com/aSMIULMjp2
— DRDO (@DRDO_India) January 20, 2022