భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖరారైంది. ఈమేరకు సీఎంకు రాజీనామా లేఖను సమర్పించిన
పార్టీలో తనకు అవమానం జరిగిందని వాపోయిన నర్సయ్యగౌడ్… మునుగోడు అభ్యర్థి విషయంలో తనను కనీసం సంప్రదించలేదన్నారు. బీసీ అభ్యర్థిని ప్రతిపాదించాలని కోరడం నేరమా అని ప్రశ్నించారు. అభిమానానికి బానిసత్వానికి తేడా ఉందని అభిమానంతోనే ఇన్నాళ్లూ కేసీఆర్ దగ్గర పనిచేశానని చెప్పుకొచ్చారాయన. పార్టీ తనను పట్టించుకోకపోవడాన్ని బట్టి పార్టీకి తన అవసరం లేదని భావించానని బూర లేఖలో పేర్కొన్నారు.
పలు కీలకాంశాలను అందులో ప్రస్తావించారు.
https://twitter.com/ANI/status/1581166728662294528?s=20&t=b41Ty3za3IxWd7CJUwha7Q