బీజేపీ కార్యకర్తల అక్రమ అరెస్టులను నిరసిస్తూ పెద్దసంఖ్యలో యువకులు వడ్డేపల్లిలో నిరసన నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గద్వాల టౌన్ ఎస్సైపై చర్యలు తీసుకోకుంటే ఎస్పీ ఆఫీసును ముట్టడిస్తామని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ శర్మ హెచ్చరించారు. పేదలకు పంచిన భూములలో అక్రమంగా నర్సింగ్ కాలేజి నిర్మాణానికి భూమిపూజ కోసం గద్వాల్ కి వచ్చిన హరీశ్ రావ్ పర్యటను అడ్డుకోబోయిన తమ వాళ్లమీద పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. BJYM గద్వాల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ను… టౌన్ ఎస్సై బలంగా కొట్టడంతో చేయి విరిగిందని..పోలీసులు గూండాల్లా భౌతికదాడులు చేయడమేంటని రాజశేఖర్ మండిపడ్డారు. శాంతినగర్ కేంద్రంలో TRS ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎస్సై పై చర్యలు తీసుకోకుంటే ఎస్పీ కార్యాలయ ముట్టడి తప్పదని… కార్యకర్తల అక్రమ అరెస్టులు, నిర్బంధాలను ఇకపై సహించేది లేదన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు DK శీను, అంజయనేయులు, it సెల్ కన్వీనర్ దురేందర్ యాదవ్,ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రాజు, యువమోర్చా మండల అధ్యక్షులు వెంకట్రాముడు, మదుకుమార్, జిల్లా నాయకులు టప్ప రాముడు, టి నరసింహులు, హరికృష్ణ, మహబూబ్ బాషా, రాయుడు, శివన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు.