దేశానికి సేవలు అందించిన మహనీయులను గౌరవించడంలో … కేంద్ర ప్రభుత్వం పార్టీల భేదం చూపడం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులను సైతం గౌరవించడం జరుగుతోంది. ఇంకా విచిత్రం ఏమిటంటే అటువంటి మహనీయులను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేయడం చెప్పుకోవలసిన విషయం.
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు,, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీల సేవలను నరేంద్ర మోడీ ప్రభుత్వమే భారతరత్నతో సత్కరించింది. తాజాగా ప్రణబ్ ముఖర్జీ స్మారక చిహ్నం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీలోని రాజ్‌ఘాట్ కాంప్లెక్స్ పరిధిలోని రాష్ట్రీయ స్మృతి స్థల్లో భూమిని కేటాయించింది. ఈ విషయాన్ని ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన సంబంధిత పత్రాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన తండ్రి సేవలను గుర్తించి గౌరవించిన కేంద్ర ప్రభుత్వానికి శర్మిష్ట ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం మెచ్చుకోదగినది అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రణబ్ ముఖర్జీ సేవలను గుర్తుపెట్టుకోలేదు. తన తండ్రి విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై కుమార్తె శర్మిష్ట ముఖర్జీ పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తో ప్రణబ్ కు దశాబ్దాల అనుబంధం ఉన్నప్పటికీ, సంతాప తీర్మానాన్ని ఆమోదించడానికి అధికారిక సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆమె ప్రశ్నించారు.
దీనిని బట్టి నెహ్రూ గాంధీ కుటుంబ సభ్యులను తప్ప ఇతర నాయకులను కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం పట్టించుకోదు అని రుజువు అవుతోంది. కానీ బిజెపి ప్రభుత్వం మాత్రం అటువంటి బేధాలు లేకుండా దేశానికి సేవలు అందించిన మహనీయులను గౌరవించడం జరుగుతోంది.