
……………………………….
తెలంగాణ రాజకీయాల్లో కరీంనగర్ గడ్డ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చక్రం తిప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వంటి పార్టీలు లోపాయికారీ ఒప్పందాలతో ఎన్ని కుట్రలు పన్నినా, వాటన్నింటినీ తన చాకచక్యంతో పటాపంచలు చేశారు. కరీంనగర్ కార్పొరేషన్‌పై బీజేపీ జెండాను ఎగురవేశారు. తెలంగాణ మొత్తం మీద బీజేపీ కైవసం చేసుకున్న ఏకైక కార్పొరేషన్ ఇదే కావడం విశేషం.
………………………………..
ఎన్నికల ఫలితాల తర్వాత మేయర్ పీఠాన్ని దక్కించుకోకుండా అడ్డుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నించింది. క్యాంపు రాజకీయాలు, ప్రలోభాలు, విపక్షాలతో రహస్య పొత్తులు.. ఇలా సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించినా బండి సంజయ్ వ్యూహం ముందు అవి నిలవలేకపోయాయి. 34 మంది కార్పొరేటర్ల మద్దతును కూడగట్టి, కొలగాని శ్రీనివాస్‌ను మేయర్‌గా, సునీల్ రావును డిప్యూటీ మేయర్‌గా గెలిపించుకోవడంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించారు. సైనికుల లాంటి కార్పొరేటర్లను కాపాడుకుంటూ, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తూ ఆయన నడిపిన రాజకీయం కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
……..
మేయర్ ఎన్నిక అనంతరం బండి సంజయ్ ఉద్వేగభరితంగా మాట్లాడుతూ, ఇది కేవలం బీజేపీ విజయం మాత్రమే కాదని, కరీంనగర్ ప్రజల ఆత్మగౌరవ విజయమని పేర్కొన్నారు. ”
…………………..
రాష్ట్రంలో అధికార పీఠంపై ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్, గల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పే ఎంఐఎం.. ఈ మూడు పార్టీలు ఏకమై బీజేపీని అడ్డుకోవాలని చూసినా, బండి సంజయ్ ‘.. ఒంటరిగానే ఆ కోటను బద్ధలు కొట్టారు. ప్రజాబలం ఉన్న నేత తలుచుకుంటే వ్యవస్థలను ఎలాగైనా ఎదుర్కోవచ్చని ఆయన నిరూపించారు. ఈ విజయంతో కరీంనగర్ గడ్డ బీజేపీకి తిరుగులేని కోట అని, బండి సంజయ్ దానికి అజేయమైన నాయకుడని మరోసారి స్పష్టమైంది.



