ఏపీ, తెలంగాణల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల బిజెపి ఎంపీ లకు తనింట్లో ఏర్పాటు చేసిన అల్పాహార సమావేశాల్లో ఈ వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో అధికారం దిశగా సాగేందుకు పార్టీ తరపున, కేంద్రం తరపున అవసరమైన సహాయ సహకారాలుంటాయని మోదీ భరోసా ఇచ్చారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఉత్తరాదిలో బలంగా ఉన్న పార్టీని దక్షిణాదిలోనూ బలోపేతం చేసేలా కేంద్ర పథకాల ప్రయోజనాలని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలన్నారు. తమ తమ నియోజకవర్గాల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎంపీలు, మంత్రులు పరిగణనలోకి తీసుకోవాలని, క్రీడాపోటీల వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.