పార్టీ చీఫ్ బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఇవాళ గవర్నర్ ను కలిసింది. ఉద్యోగులను ఇబ్బంది పెట్టేలా ఉన్నజీవో నెంబర్ 317ను సవరించాలని కోరుతూ తమిళిసై కి వినతిపత్రం అందజేశారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకోకుండా బదిలీల ప్రక్రియను ఎలా చేపడుతారని ప్రశ్నించారు. ఉద్యోగుల వల్లే తెలంగాణ వచ్చిందని.. తాను సీఎం అయ్యాననే విషయాన్ని కేసీఆర్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. వెంటనే జీవోను సవరించాలని డిమాండ్ చేశారు.