భారత రాజకీయ యవనికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుగులేని నాయకుడిగా మరోసారి తన ప్రభావాన్ని చాటుకుంటున్నారు. 2024 ఎన్నికల తర్వాత ప్రతిపక్షాల విమర్శలు వెల్లువెత్తినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజల నమ్మకం మాత్రం ప్రధాని మోదీపై చెక్కుచెదరలేదని తాజా సర్వేలు మరియు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ‘బ్రాండ్ మోదీ’ కి పెరుగుతున్న ఆదరణతో ఎన్డీయే కూటమి విజయయాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తోంది.
ఇండియా టుడే-సీఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ (జనవరి 2026) తాజా సర్వే ప్రకారం, ఒకవేళ సార్వత్రిక ఎన్నికలు ఈరోజే జరిగితే ఎన్డీయే కూటమి 352 స్థానాలను గెలుచుకుంటుందని అంచనా. 2024 ఎన్నికల్లో 44 శాతంగా ఉన్న ఎన్డీయే ఓట్ల శాతం, ఇప్పుడు 47 శాతానికి పెరగడం గమనార్హం.
2025లో ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో చక్కని విజయాలు లభించాయి. 2026 ఆరంభంలో మహారాష్ట్రలో బీఎంసీ (BMC) సహా ఇతర మున్సిపల్ ఎన్నికలలో కూడా అదే ట్రాక్ నడిచింది. ఇవన్నీ ప్రధాని మోదీ నాయకత్వానికి ప్రజలు ఇస్తున్న మద్దతుకు నిదర్శనం. రాబోయే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల ఎన్నికలపై కూడా ఈ ప్రభావం గట్టిగా ఉండబోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కొద్ది కాలంగా ప్రధాని మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు మరియు దౌత్యపరమైన విజయాలు దేశప్రజల్లో ఆయన పట్ల గౌరవాన్ని మరింత పెంచాయి:
………..
జాతీయ భద్రత – ఆపరేషన్ సిందూర్: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సైనిక చర్యతో భారత్ తన భద్రత విషయంలో రాజీ పడదని ప్రపంచానికి చాటి చెప్పారు.
అంతర్జాతీయ దౌత్యం: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన కఠినమైన సుంకాలు మరియు వాణిజ్య వ్యూహాలకు భారత్ లొంగకుండా, దేశ ప్రయోజనాలే పరమావధిగా నిలబడింది. అదే సమయంలో యూకే (UK) మరియు యూరోపియన్ యూనియన్ (EU) తో కీలక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడంలో మోదీ విజయం సాధించారు.
అంతరిక్ష ప్రయోగాల్లో మైలురాయి: అనేక అంతిరిక్ష ప్రయోగాలలో ఇస్రో అద్బుతమైన విజయాలు సాధించింది. మోదీ సర్కార్ ఇస్తున్న ప్రోత్సాహకాలతో ఇస్రో చక్కటి పురోగతి సాధిస్తోంది.
సాంస్కృతిక పునరుజ్జీవనం: అయోధ్యలో రామాలయ ధ్వజారోహణ, ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా వంటి కార్యక్రమాలు దేశీయంగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపాయి.
రైతు సంక్షేమం: అమెరికాతో వాణిజ్య చర్చల సమయంలోనూ భారత రైతులు, పాడి పరిశ్రమ ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గకుండా ప్రధాని మోదీ ప్రదర్శించిన పట్టుదల గ్రామీణ ప్రాంతాల్లో ఆయనపై నమ్మకాన్ని పెంచింది.
……………..
అభివృద్ధి, జాతీయ భద్రత మరియు ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్టను పెంచడంలో ప్రధాని మోదీ చూపిస్తున్న చొరవ, ఆయన్ను మరోసారి దేశ ప్రజల ఆశాజ్యోతిగా నిలబెడుతోంది. విపక్షాల ఆరోపణలు ఎన్ని ఉన్నా, ‘మోదీ గ్యారెంటీ’పై ప్రజల్లో నమ్మకం రోజురోజుకూ బలపడుతోంది.



