బిజెపి నేత, మెదక్ ధర్మకార్ (కటికె) శ్రీనును గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారు.
హొండా సిటీ కార్ లో పెట్టి నిప్పుపెట్టి సజీవదసనం చేసినట్టు సమాచారం.ఆర్థిక లావాదేవీలే శ్రీను హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. గతంలోనూ పలుమార్లు శ్రీనుపై హత్యాయత్నం జరిగింది. అప్పుడు తప్పించుకున్న శ్రీనును ఈసారి పథకం ప్రకారం హత్యచేశారు. అందరికీ అందుబాటులో ఉంటూ తలలోనాలికలా మెదిలే శ్రీను హత్యతో మెదక్ లో విషాదచాయలు అలముకున్నాయి.
వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో పోలీసులు కారును, డిక్కీలో మృతదేహాన్ని గుర్తించారు. హత్యకేసును త్వరలో ఛేదించి హంతకులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.