భారతీయ జనతా పార్టీ అంటేనే హిందుత్వ పార్టీ అనే ముద్ర ఉంది. అంతే కాదు మతం పేరుతో ప్రజల్ని విడదీస్తోందని విపక్షాలూ టార్గెట్ చేస్తుంటాయి. అలాంటిది ఈ ఎన్నికల్లో మతాలకు అతీతంగా ఆ పార్టీకి అండగా నిలిచి గెలిపించారు ఓటర్లు. ఈశాన్య రాష్ట్రం మణిపాల్‌లో క్రైస్తవ జనాభా గణనీయంగా ఉంటుంది. అలాంటి చోట మళ్లీ కమలం పార్టీకే పట్టం కట్టారు. అంతేకాదు గతంలో కన్నా ఈసారి ఓట్ల శాతం మరింత పెరిగింది ఆపార్టీకి. ఇక క్రైస్తవ మైనార్టీలు ఎక్కువగా ఉన్న మరో రాష్ట్రం గోవా. ఆయితే గోవాలోనూ వరుసగా మళ్లీ బీజేపీనే గెలిపించారు ప్రజలు. ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. సీట్లతో పాటు ఓట్లనూ పెంచుకుంది అక్కడ ఆ పార్టీ. గతంలో కన్నా ఓట్ల శాతం బీజేపీకి గణనీయంగా పెరగడం విశేషం. గోవాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 32.5శాతం ఓట్లు రాగా..ఈ సారి 33.3 శాతం ఓట్లు వచ్చిచేరాయి. మణిపూర్‌లో క్రితంసారి 36.3 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి 37.5 శాతం ఓట్లు సాధించింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)