మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండమని దేవేంద్ర ఫడ్నవీస్‌ను పార్టీ కేంద్ర నాయకత్వం కోరిందని భారతీయ జనతా పార్టీ అధినేత జేపీ నడ్డా తెలిపారు.
“దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో భాగం కావాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. కాబట్టి, నేను అతనికి వ్యక్తిగత అభ్యర్థన చేస్తున్నా.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టాలని కేంద్ర నాయకత్వం చెప్పింది” అని నడ్డా పేర్కొన్నారు.
https://twitter.com/ANI/status/1542495109014757376?s=20&t=5Ku_P9MICKCJneRVVl1JPQ
శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ షిండేను కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ఎంపిక చేసిన తర్వాత ఇది జరిగింది. ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.